Isaiah 41:13(KJV)

2K
303
posts
303
303
 
నీ జీవితములో నీవు పైకి రాకూడదని దుష్టుడు ఎన్ని అడ్డుగోడలు కట్టుకుంటూ వెళ్లినా, అది చెడు వ్యసనమైనా, బలహీనత అయినా, రోగమైనా, బాధ అయినా, వదల్లేకపోతున్న అలవాటైనా ఏదైనా కావొచ్చు. కానీ ఇశ్రాయేలీయుల స్తుతి ముందు యెరికో గోడలు కూలినట్టు, నీ స్తుతి ముందు, ప్రార్థన ముందు, నీ యొక్క సమర్పణ ముందు, దేవుని చిత్తం నెరవేర్చాలనే నీ మనస్సు ముందు దుష్టుడి అడ్డు గోడలు కుప్పకూలిపోతాయి. నిన్ను బాధపెట్టి వేదనకు గురిచేసిన సమస్యలు పటాపంచలైపోతాయి. కాబట్టి నీవు నిరుత్సాహపడకు, చింతపడకు, భయపడకు, కలవరపడకు. నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ముందుకే సాగిపో. "నీ దేవుడనైన యెహోవానగు నేనుభయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను." - యెషయా 41:13 అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని చేతిని పట్టుకొని ముందుకే సాగిపో. ప్రతీ అడ్డు తొలగిపోతుంది. ప్రతీ దుర్గము పడగొట్టబడుతుంది. #dailydevotional #shailapaul Maybe the evil one is building strongholds in your life, maybe it is bad addiction, weakness, disease or pain, fleshly desires, presumptuous sins, whatever it may be. But just as the walls of Jericho fell down before the praise of the Israelites, the walls of the evil one will fall before your praise, before your prayer, before your submission, before your mind to do God's will. The problems that have caused you pain and agony will disappear. So don't be discouraged, don't be frustrated, don't be afraid, don't be disturbed. Confess your sins before God and move on. " For I am the LORD your God who takes hold of your right hand and says to you, Do not fear; I will help you. - Isaiah 41:13" says the Bible. So hold the hand of God and go forward. Every obstacle will be removed. Every Stronghold will be demolished. Every Jericho wall will be collapsed. #dailydevotional #shailapaul
  • 0
  • 89
  • 0